పుట:Abhinaya darpanamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆశ్చర్యపడుట, జడచూపుట, గొడుగు, నేర్పరితనము, మూల అనుట, నూగారు, భేరి వాయించుట, కుమ్మరవాని చక్రము తిరుగుట, బండిచక్రము, సమూహము, వివరించుట, సాయంకాలము వీనియందు ఈ హస్తము వినియోగించును.

గ్రన్థాన్తరస్థసూచీముఖహస్తలక్షణమ్

సూచీముఖో భవేదూర్ధ్వం కటకాముఖతర్జనీ.

311


అహమేక ఇతి బ్రహ్మా నిర్దేశమకరోద్యతః,
తస్మాద్విరించినో జాతః సూచిరస్య ఋషీరవిః.

312


దేవజాతి శ్శ్వేతవర్ణా విశ్వకర్మా౽ధిదేవతా,

తా. కటకాముఖహస్తముయొక్క చూపుడువ్రేలు పైకెత్తఁబడెనేని సూచీముఖహస్త మగును. పూర్వకాలమునందు బ్రహ్మ నేనొకఁడనే యని నిర్దేశించునపుడు ఆ బ్రహ్మవలన ఈ సూచీహస్తము పుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఋషి సూర్యుఁడు, వర్ణము శ్వేతము. అధిదేవత విశ్వకర్మ.

వినియోగము:—

శ్లాఘాయాం సత్యవచనే దూరదేశనిరూపణే.

313


ప్రాణార్థే చ పురోగే౽పి ఏకసఙ్ఖ్యానిరూపణే,
సంధ్యాయాం విజనే నాళే సాధువాదే నిరీక్షణే.

314


తథేతి వచనే లోకే పరబ్రహ్మనిరూపణే,
ఏకార్థే౽పిశలాకాయాం రథాఙ్గ భ్రమణేరవౌ.

315


ఉదయాస్తమయేబాణే గూఢనాయక దర్శనే,
శిలీముఖే చ యచ్ఛబ్దే తచ్ఛబ్దేలోహ నాళయోః.

316