పుట:Abhinaya darpanamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పు లిచ్చుట, కస్తూరి మొదలగువస్తువులను మెదుపుట, బోగమువారి కౌఁగిలింత, వింటీని తిగుచుట, చక్రాయుధమును ధరించుట, విసనకఱ్ఱపట్టుట, బంగారువన్నె, దేవజాతి వీనియందు ఈహస్తము వినియోగించును.

13. సూచీహస్తలక్షణమ్

ఊర్ధ్వం ప్రసారితా యత్ర
కటకాముఖతర్జనీ,
భవేత్సూచీకరస్సో౽యం
కీర్తితో భరతాగమే.

307

తా. ముందు చెప్పిన కటకాముఖహస్తమునందలి చూపుడువ్రేలు పొడుగుగా చాఁచఁబడిన యెడ సూచీహస్త మగును.

వినియోగము:—

ఏకార్థే౽పి పరబ్రహ్మ భావనాయాం శతే౽పిచ,
రవౌ నగర్యాం లోకార్థే తథేతి వచనే౽పి చ.

308


యచ్ఛబ్దే౽పిచ తచ్ఛబ్దే వ్యజనార్థే౽పితర్జనే,
కార్శ్యేశలాకావపుషోరాశ్చర్యే వేణిభావనే.

309


ఛత్రే సమర్థేకోణేచ రోమాళ్యాంభేరిభేదనే,
కులాలచక్రభ్రమణే రథాంగే మండలే తథా.

310


వివేచనేదినాం తేచ సూచీహస్తః ప్రకీర్తితః,

తా. ఒకటి అనుట, పరబ్రహ్మనిరూపణము, నూరు అనుట, సూర్యుఁడు, నగరము, లోకము అనుట, అట్లు అనుట, ఎవఁడు ఎవతె ఏది యనుట, వాఁడు ఆమె అది యనుట, విసనకఱ్ఱ, వెరపించుట, కృశించుట, సలాక, దేహము,