పుట:Abhinaya darpanamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మెల్లగా ఆకర్షించుట, ఆకుమడుపు లిచ్చుట, కస్తూరి మొదలగు ద్రవ్యం కలుపుట, వాసన ద్రవ్యములు చేర్చుట, మాట, చూపు వీనియందు ఈహస్త ముపయోగింపఁబడును.

గ్రంథాంతరస్థ కటకాముఖలక్షణమ్

ప్రత్యంగుష్ఠయుతఃక్షిప్తః కపిత్థః కటకాముఖః.

301


అభ్యస్యతోధనుర్విద్యాం గుహాదీశ్వరసన్నిధౌ,
కటకాముఖహస్తో౽భూద్భార్గవోఋషిరుచ్యతే.

302


దేవజాతి స్వర్ణవర్ణో రఘురామో౽స్య దేవతా,

తా. కపిత్థహస్తముయొక్క బొటనవ్రేలు ఎత్తి పట్టఁబడునేని కటకాముఖహస్త మగును. శివునియొద్ద కుమారస్వామి విలువిద్య నేర్చునపుడు ఈ ముఖహస్తము పుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఋషి భార్గవుఁడు. స్వర్ణవర్ణం. అధిదేవత రఘురాముఁడు.

వినియోగము:—

ముక్తాస్రజాంపుష్పదామ్నాం చామరాణాంచ ధారణే.

303


ఆకర్షణే శరాదీనాం దర్పణాభిముఖగ్రహే,
లీనవహనే వృంతభేదనే దంతధావనే.

304


కుసుమాపచయే నాగవల్లీదళపరిగ్రహే,
కస్తూరికాదినిష్పేషే వారస్త్రీణాం నిగూహనే.

305


ధనురాకర్షణే చక్రధారణే వ్యజనగ్రహే,
స్వర్ణవర్ణే దేవజాత్యాం యుజ్యతే కటకాముఖః.

306

తా. ముత్యాలసరము, పూలదండ, వింజామరము వీనిని ధరించుట; బాణము మొదలైనవానిని ఆకర్షించుట, అద్దము నెదుటికి తెచ్చుట, కళ్లెము పట్టుట, తొడిమను త్రుంచుట, పండ్లు తోముట, పువ్వులు కోయుట, ఆకుమడు