పుట:Abhinaya darpanamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. జయజయయనుట, మేఘము,నిషేణము, అడవి, రాత్రి, పొమ్మనుట, నడచుట, గుఱ్ఱము, గాలి, రొమ్ము, ఎదురు, పుణ్యము, అతిశయము, .ప్రవాహము, దేవలోకము, హాహాకారము, వెన్నెల, ఎండ, దేవతాసమూహము, గడియ తీయుట, గోడ, నరకుట, సంతోషము, చెక్కిలి, గంధము పూయుట, కత్తి, నీటికి కట్టవేయుట, గుంపు, దండుయొక్క ఆయత్తము, సమయము, వెరపుతీర్చుట, ఆశ్రయములేమి, క్షయము, కప్పుట, పానుపు, భూమి, నిప్పుకుంట, వానధార, అల, పక్షిరెక్క, ప్రభువుతో మనవి చేయుట, ఇక్కడననుట, ఎట్టిది అట్టిది యనుట, చెంపపెట్టు, వస్తువులను అంటుట, కొలను, ఒడలు పిసుకుట, వ్యాజస్తుతి, ప్రతాపము, దేవతానివేదనము, ప్రక్కకౌఁగిలింత, టెక్కెము, పెద్దగాలి, కొంగు, చలి, ఉక్క, తళతళ, నీడ, సంవత్సరము, ఋతువు, అయనము, దినము, పక్షము, మాసము, తేట, గొప్పవంశము, సమీపించుట, పాలింపుము లాలింపుము అనుట, బ్రాహ్మణజాతి, శుభ్రవర్ణము వీనియందు ఈ హస్తము వినియోగించును.

2. త్రిపతాకహస్తలక్షణమ్

సఏవ త్రిపతాకస్స్యా
ద్వక్రితా నామికాంగుళిః,

తా. ముందు చెప్పిన పతాకహస్తమందలి యనామిక (అనఁగా చిటికినవ్రేలికి ముందువ్రేలు) వంచఁబడెనేని యది త్రిపతాకహస్త మగును.

వినియోగము:—

మకుటే వృక్షభావేచ వజ్రేతద్ధరవాసవే.

227


కేతకీ కుసుమే దీపే వహ్నిజ్వాలా విజృమ్భణే,