పుట:Abhinaya darpanamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

శ్రీమత్సకలభువనకర్తయైన శ్రీయఃపతికిం బ్రియతమంబై నిఖిలరసిక జనాహ్లాదభాజనంబై సర్వలోకవ్యాపకంబై విలసిల్లెడి భరతశాస్త్రము.---

"శంభుర్గౌరీ తథా బ్రహ్మా మాధవో నందికేశ్వరః,
దత్తిలోకోహళశ్చైవ యజ్ఞవల్క్యశ్చ నారదః.
హనూమాన్విఘ్న రాజశ్చ షణ్ముఖోథబృహస్పతిః,
అర్జునో రావణశ్చైవ కన్యాబాణసుతాతథా.
ఏతే భరతకర్తారో భువనేషు ప్రకీర్తితాః.

అనగా, శివుడు, పార్వతి, బ్రహ్మ, విష్ణువు, నందికేశ్వరుడు, దత్తిలుడు, కోహళుడు, యాజ్ఞవల్క్యుడు, నారదుడు, ఆంజనేయుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, బృహస్పతి, అర్జునుడు, రావణుడు, ఉషాకన్యక అనువారు భరతశాస్త్రకర్తలు అని లోకములయందు కొనియాడబడుచున్నారు అను నీయర్థముగల ప్రమాణశ్లోకములచేత వన్నెకెక్కియున్నది. అట్లుండియు ప్రకృతమునందు మనవారందరును అభినయవిద్యను సాధారణవిద్యలలో నొకటిగా దలచి యాదరింపకపోవుటయే గాక, అది కేవల పామరరంజకవిద్య