తా. వ్రేళ్లను వెనుకప్రక్కకు ముడిగించుట, కదలించుట, చాఁచుట యను హస్తప్రాణము ప్రేరిత మనఁబడును.
7. ఉద్వేష్టితము:—
| హస్తానామూర్ధ్వభాగేయద్గమనంచా౽స్తినర్తనే. | 194 |
| తదుద్వేష్టితమిత్యాహు ర్భరతాగమవేదినః, | |
తా. నాట్యకర్మమునందు చేతులను మీఁది కెత్తుట యనెడి హస్తప్రాణము ఉద్వేష్టిత మనఁబడును.
8. వ్యావృత్తము;—
| ఉదగ్రతఃపార్శ్వభాగే హస్తోవ్యావృత్తకోభవేత్. | 195 |
తా. పార్శ్వభాగములందు మీఁది కెత్తఁబడిన చేతులుగల హస్తప్రాణము వ్యావృత్త మనఁబడును.
9. పరివృత్తము:—
| పార్శ్వాభ్యాంచ పురోభాగే యోహస్తో నటనే కృతః, | 196 |
తా. నాట్యము చేయునపుడు పార్శ్వములనుండి ముందరితట్టునకు చేతులను తెచ్చుట అనుహస్తప్రాణము పరివృత్త మనఁబడును.
10. సజ్కేతము:—
| ఊహావిధానరచనావినాస్థూలోక్తిపూర్వకమ్, | 197 |
తా. స్థూలోక్తి పరంపరలేక ఊహచేత తెలిసికోఁదగిన సైగగల హస్తప్రాణము సంకేత మనఁబడును.