తా. మిక్కిలి విరిసినగ్రుడ్లతో నాకాశమున నిగుడ్పఁబడిన దృష్టి యాకాశదృష్టి. ఆకాశమునందు సంచరించు వస్తువులు మొదలగు వానియం దిది చెల్లును.
37. అర్ధముకుళము:—
| సస్మితాచ భవేత్తారా కిఞ్చిదున్ముషితాపుటా. | 164 |
| స్యాదర్ధముకుళా దృష్టిశ్చా౽౽నందాహ్లాదగోచరా, | |
తా. చిరునవ్వుతో విూఁదికి కూరుకొనఁబడుచున్న రెప్పలు గలది అర్ధముకుళదృష్టి యనఁబడును. ఇది ఆనందాహ్లాదముల గోచరమైయుండును.
38. అనువృత్తము:—
| అనువృత్తా యదుక్తం తద్భూయో భూయోనిరీక్షణం. | 165 |
తా. మాటిమాటికి చూచుట అనువృత్తదృష్టి యనఁబడును.
వినియోగము:—
| త్వరాదిషు ప్రయోక్తవ్యా కలితాభావకోవిదైః, | |
తా. ఇది తత్తరపాటు మొదలగువానియందు వినియోగింపఁబడును.
39. విప్లుతము:—
| స్ఫురితోత్ఫుల్ల పతితపుటాదృగ్విఫ్లుతాభవేత్. | 166 |
తా. కదలింపఁబడి, విరిసి, వాల్పఁబడిన రెప్పలుగలది విప్లుతదృష్టి యనఁబడును.
వినియోగము:—
| ఏషాతు సర్వవస్తూనాం సౌందర్యాద్యవలోకనే, | |
తా. ఈదృష్టి అన్నివస్తువులయొక్క సౌందర్యాదులను జూచుటయందు చెల్లును.