తా. రెప్పలకదలికయు, దర్శనాలసములగు నల్లగ్రుడ్లును గలచూపు అభితప్తదృష్టి యనఁబడును. ఇది విసుగు మొదలగు వానియందు వినియోగించును.
22. అవలోకితము:—
| అధస్తాదర్శనం యత్తదవలోకిత ముచ్యతే. | 149 |
తా. క్రిందుగ చూచెడిచూపు అవలోకితదృష్టి యనఁబడును.
వినియోగము:—
| వినియోగో భవేదస్యా విచారపఠనాదిషు, | |
తా. ఈ దృష్టి విచారము, చదువుట మొదలైన విషయములందు వినియోగించును.
23. శూన్యము:—
| సమతారా పుటాబాహ్యా నిష్కమ్పా శూన్యదర్శనా. | 150 |
| బాహ్యర్థాగ్రహణే చేయం శూన్యదృష్టిరుదాహృతా, | |
తా. సమములైన నల్లగ్రుడ్లును రెప్పలును గలదియు, బయలుపడినదియు, చలనము లేనిదియు, శూన్యమును చూచునదియు నైన చూపు శూన్యదృష్టియనఁబడును. ఇది బాహ్యార్థాగ్రహణమునందు వినియోగించును.
24. హృష్టము:—
| చఞ్చలాదృశ్యతే యాతు రుచిరాచ నిమేషభాక్. | 151 |
| ఈషత్సఙ్కో చితాదృష్టిర్హృష్టాహాసే ప్రయుజ్యతే, | |
తా. చలించునదియు, మనోహరమయినదియు, రెప్పపాట్లు గలదియు, కొంచెము సంకోచింపఁబడినదియు నైన చూపు హృష్టదృష్టి యనఁబడును. ఈదృష్టి నవ్వునందు వినియోగపడును.
25. ఉగ్రము:—
| సమ్యగ్వికసితా కిఞ్చిదపాఙ్గ ద్వయశోణిమా. | 152 |