15. రౌద్రము:—
| అస్నిగ్ధా లోహితాక్రూరా నిస్తబ్ధపుటతారకా. | 141 |
| భ్రుకుటీకుటిలోద్వృత్తా రౌద్రారౌద్రే దృగుచ్యతే, | |
తా. ప్రీతి లేనిదియు, ఎఱ్ఱనయినదియు, క్రూరమయినదియు, చలించని రెప్పలు నల్లగ్రుడ్లు గలిగినదియు, వంకరైన కనుబొమలు గలిగినదియు, మీఁదికి తెరవఁబడినదియు నైన చూపు రౌద్రదృష్టి యనఁబడును. ఈదృష్టి రౌద్రరసమునందు వినియోగించును.
16. దూరము:—
| కిఞ్చిదూర్ధ్వ వికాసేన దూరదృష్టిరుదాహృతా. | 142 |
తా. కొంచెము మీఁది కెత్తఁబడిన చూపు దూరదృష్టి యనఁబడును.
వినియోగము:—
| దూరావలోకనే ప్రోక్తా భావశాస్త్రవిచక్షణైః, | |
తా. దూరముననుండు వస్తువులను జూచుటయందు ఈదృష్టి వినియోగపడును.
17. ఇంగితము :—
| సహర్షేఙ్గితదృష్టిస్స్యాత్కటాక్ష చలనక్రమాత్. | 143 |
| ఇంగితాదిష్వియంభావ నేతృభిస్సముదాహృతా, | |
తా. కటాక్షచలనము గలిగి సంతోషముతోఁ గూడిన చూపు ఇంగితదృష్టి అనఁబడును. ఇది ఇంగితము మొదలైనవానియందు వినియోగింపఁబడును.
18. విలోకితము:—
| వీక్షణం పృష్ఠభాగేయత్తద్విలోకిత ముచ్యతే. | 144 |
| ఇయందృష్టి ర్భవేత్పశ్చా ద్దేశవృత్త్యవలోకనే, | |