వినియోగము:—
| ఉభయోః పార్శ్వయోరస్తు దర్శనాదిషు యుజ్యతే. | 127 |
తా. ఇరుప్రక్కలనుండు వస్తువులు జూచుట మొదలైన వానియందు ఈదృష్టి వినియోగించును.
3. స్నిగ్ధ:—
| సహర్షాసాభిలాషాచ మనోజ్ఞా౽న్తః ప్రకాశినీ, | 128 |
తా. సంతోషముతోడను, అభిలాషముతోడను గూడునదియు, మనోజ్ఞత గలదియు, అంతర్వికాసము గలదియు, మన్మథోద్రేకము గలదియు నైన దృష్టి స్నిగ్ధ యనఁబడును. ఇది స్నేహముగల వస్తువు మొద లైన వానియందు వినియోగించును.
4. శృంగారము:—
| హర్షిత్పన్నప్రమోదోత్థా కామం కామవశంవదా, | 129 |
| భవేన్మనోభవావిష్ట కామినీ వీక్షణాదిషు, | |
తా. సంతోషమువలనఁ బుట్టిన సుఖవిశేషమునందుఁ గలిగినదియు, మిక్కిలి మన్మథాధీనమయినదియు, మనోజ్ఞురాండ్ర కనుబొమ్మలు నిక్కించుటవలనను, కడగంటిచూపువలనను గలిగినదియునైన చూపు శృంగారదృష్టి యనఁబడును. ఈదృష్టి మన్మథావేశముగల స్త్రీల వీక్షణము మొదలగువానియందు చెల్లును.
5. ఉల్లోకితము:—
| ఉల్లోకితా పరిజ్ఞేయా ఊర్ధ్వభాగావలోకనమ్. | 130 |
తా. మీఁదిభాగము జూచునట్టిది ఉల్లోకితదృష్టి యనఁబడును.