| సౌందర్యాఖ్యశిరః ప్రోక్తం సర్వనాట్యే ప్రశస్యతే. | 106 |
తా. క్రిందుమీఁదులకు త్రిప్పుటవలన వెనుకతట్టు చలించుట గలది సౌందర్య శిరస్సు. ఆది యెల్ల నాట్యములందు ప్రశంస చేయఁబడుచున్నది.
వినియోగము:—
| కారణాభినయే హస్తభ్రమణాఖ్యేచ నర్తనే, | 107 |
తా. కారణాభినయము, హస్తభ్రమణము అను నృత్తము, యోగాభ్యాసము వీనియందు ఈ శిరస్సు చెల్లును.
అథా౽ష్టదృష్టిభేదా లక్ష్యన్తే
| సమమాలోకితం సాచీ ప్రలోకితనిమీలితే, | 108 |
| ఇత్యష్టదృష్టిభేదాస్తు కీర్తితా భరతాగమే, | |
తా. సమము, ఆలోకితము, సాచి, ప్రలోకితము, నిమీలితము, ఉల్లోకితము, అనువృత్తము, అవలోకితము, అని దృష్టి యెనిమిదివిధములు గలదిగా భరతశాస్త్రమునందుఁ జెప్పఁబడినది.
1. సమము:—
| వీక్షితం సురనారీభిస్సమానం సమవీక్షణమ్. | 109 |
తా. దేవతాస్త్రీలవ లే రెప్పపాటులేక చూచుట సమదృష్టి యనఁబడును.
వినియోగము:—
| నాట్యారమ్భే తులాయాఞ్చ అన్యచిన్తావినిశ్చయే, | 110 |