ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వినియోగము:-
| | విస్మయే దృశ్యతే తచ్చ పరాభిప్రాయవేదనే, | |
తా. ఆశ్చర్యము, ఇతరులయభిప్రాయము నెఱుఁగుట వీనియందు ఈశిరస్సునకు వినియోగము.
18. సమశిరము:—
| | స్వాభావికం సమం శీర్షం స్వభావాభినయాదిషు. | 99 |
తా. ఉన్నది యున్నట్టుండు శిరస్సు సమము. ఇది స్వభావాభినయము మొదలైనవానియందు వినియోగించును.
19. పార్శ్వాభిముఖము:—
| | పార్శ్వాభిముఖమన్వర్థం పార్శ్వస్థ స్యా౽వలోకనే, | |
తా. ప్రక్కకుఁ ద్రిప్పఁబడు శిరస్సు పార్శ్వాభిముఖ మనఁబడును. అది ప్రక్కనుండువారిని జూచుటయందు ఉపయోగించును.
20. సౌమ్యము:—
| | నిశ్చలం సౌమ్యమాఖ్యాతం నృత్తారంభే ప్రయుజ్య తే. | 100 |
తా. చలనము లేక ఉండు శిరస్సు సౌమ్య మనఁబడును. అది నాట్యారంభమం దుపయోగింపఁబడును.
21. ఆలోలితము:—
| | సమంతాల్లాలితం యత్తదాలోలిత మితీరితమ్, | |
తా. అంతటను ద్రిప్పఁబడు శిరస్సు ఆలిత మనఁబడును.
వినియోగము:—
| | పుష్పాంజలిక్రమే చారినటనే లవణే తథా. | 101 |
| | ఆలోలితస్య శిరసో వినియోగో౽భిధీయతే, | |