ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వినియోగము:—
| నిద్రాగమగ్రహావేశ మదమూర్ఛాసు తన్మతమ్, | |
తా. నిదురవచ్చుట, దయ్యము సోఁకుట, మదము, మూర్ఛ వీనియందు ఈశిరస్సు చెల్లును.
15. తిర్యఙ్నతోన్నతము:—
| తిర్యఙ్నతోన్నతిం ప్రాప్తం శిరస్తిర్యఙ్నతోన్నతమ్. | 96 |
తా. అడ్డముగవంచి యెత్తఁబడిన శిరస్సు తిర్యఙ్నతోన్నత మనఁబడును.
వినియోగము:—
| బిబ్బోకాదిషు కాంతానాం తత్ప్రయోజ్యం ప్రచక్షతే, | |
తా. స్త్రీలయొక్క బిబ్బోకము మొదలగు విలాసచేష్టలయందు ఈ శిరస్సు వినియోగింపఁబడును.
16. స్కంధానతము:—
| స్కంధానతం తదాఖ్యాతం స్కంధేయన్నిహితం శిరః. | 97 |
తా. మూఁపుమీఁదికి వంపఁబడిన శిరస్సు స్కంధానతమనఁబడును.
వినియోగము:—
| తన్నిద్రామదమూర్ఛాసు చింతాయాం చ ప్రయుజ్య తే, | |
తా. ఆశిరస్సు నిద్ర, మదము, మూర్ఛ, చింత వీనియం దుపయోగింపఁబడును.
౧౭. ఆరాత్రికము:—
| స్కంధే తు కించిదాశ్లిష్య భ్రాంతమారాత్రికం మతమ్. | 98 |
తా. మూఁపులయందు కొంచెము తాఁకించి త్రిప్పఁబడుశిరస్సు ఆరాత్రిక మనఁబడును.