| పరావృత్తానుకరణే పృష్ఠతః ప్రేక్షణే భవేత్. | 93 |
తా. కోపము, లజ్జ మొదలగుదానిచే ముఖమును చాఁచుట, ఒకతట్టు తిరిగినదాని ననుకరించుట, వెనుకతట్టు చూచుట వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.
12. ఉత్క్షిప్తము:—
| ఊర్ధ్వవక్త్రం శిరోజ్ఞేయ ముత్క్షిప్తం తత్ప్రచక్షతే, | |
తా. మీఁది కెత్తఁబడిన మొగముగల శిరస్సు ఉత్తిక్షిప్త మనఁబడును.
వినియోగము:—
| దర్శనే తుంగవస్తూనాం చంద్రాదివ్యోమగామినామ్. | 94 |
తా. ఎత్తైన పదార్థములను జూచుట, చంద్రుఁడు మొదలైన ఆకాశసంచారులను జూచుట వీనియందు ఈ శిరస్సు వినియోగింపఁబడును.
13. అధోముఖము:—
| అధోముఖం శిరోయత్ర తత్ర ప్రాహురధోముఖమ్, | |
తా.క్రిందుమొగముగా వంచఁబడిన శిరస్సు అధోముఖ మనఁబడును.
| లజ్జా ఖేద ప్రణామేషు స్యాదన్వర్థమధోముఖమ్. | |
తా. సిగ్గు, దుఃఖము, మ్రొక్కుట వీనియందు ఈశిరస్సు వినియోగించును.
14. లోలితము:—
| శిరస్స్యాల్లోలితం గర్వాధిక్యాచ్ఛిథిలలోచనమ్. | 95 |
తా. గర్వాధిక్యము చేత తేలవేయఁబడిన కన్నులు గలశిరస్సు లోలిత మనఁబడును.