తా. ఇరుప్రక్కలకును ఇంచుక వంపఁబడినమెడ గలశిరస్సు అంచిత మనఁబడును.
వినియోగము:—
| దుశ్చింతా మోహమూర్ఛాదౌ తత్కార్యమధరేక్షణే. | 90 |
తా. దురాలోచనము, మోహము, మూర్ఛ మొదలైనవి, క్రింద నుండు వస్తువులను చూచుట వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపఁబడును.
10. నిహంచితము:—
| ఉత్క్షిప్తబాహుశిఖర లగ్నగ్రీవం నిహంచితమ్, | |
తా. పొడువుగ నెత్తఁబడిన మూఁపుతో మెడను జేర్చిన శిరస్సు నిహంచిత మనఁబడును.
వినియోగము:—
| విలాసే లలితే గర్వే బిబ్బోకే కిలికించితే. | 91 |
| మోట్టాయితే కుట్టమితే మౌనే స్తంభేచ తద్భవేత్, | |
తా. విలాసము, లలితము, గర్వము, బిబ్బోకము, కిలికించితము, మోట్టాయితము, కుట్టమితము, మౌనము, స్తంభము ఆను వీనియందు ఈ శిరస్సు వినియోగింపఁబడును. (ఇందలి విలాసము మొదలగువాని అర్థము భరతరసప్రకరణమునందు వివరింపఁబడియున్నది.)
11. పరావృత్తము:—
| పరాఙ్ముఖీకృతం శీర్షం పరావృత్తం శిరోభవేత్. | 92 |
తా. పెడమొగముగలదిగాఁ ద్రిప్పఁబడిన శిరస్సు పరావృత్త మనఁబడును.
వినియోగము:—
| తత్కార్యం కోపలజ్జాది కృతే వక్త్రప్రసారణే, | |