తా. ముందుపోవుదాని జూపుట, అడిగెడిజాడ చూపుట, ఉపదేశించుట, ఆవాహనము చేయుట, తనమనస్సునందు చెప్పుకొనుట వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపఁబడును.
7. ఉద్వాహితము:—
| సకృదూర్ధ్వం శిరోనీత ముద్వాహితశిరోమతమ్, | |
తా. కొంచెము మీఁది కెత్తఁబడిన శిరస్సు ఉద్వాహిత మనఁబడును.
వినియోగము:—
| శక్తో౽హమస్మి కార్యేష్విత్యభిమానే ప్రయుజ్యతే. | 87 |
తా. అన్నిటికిని నేను చాలుదు నను గర్వమున నీ శిరస్సు వినియోగింపఁబడును.
8. పరివాహితము:—
| పరం మండలికాకారం భౌమితం పరివాహితమ్, | |
తా. చక్రాకారముగ మిక్కిలి త్రిప్పఁబడు శిరస్సు పరివాహిత మనఁబడును.
వినియోగము:—
| లజ్జాభావేభ్రమేమౌనే వల్లభానుకృతౌ తథా. | 88 |
| విస్మయేచ స్మి తేహర్షే రోమాంచే౽పి ప్రమోదనే, | 89 |
తా. సిగ్గులేమి, భ్రమము, మానము, ప్రియుని అనుకరించుట, ఆశ్చర్యము, చిరునవ్వు, సంతోషము, పులకాంకురము, సంతోషింపఁ జేయుట, విచారము వీనియందు ఈ శిరస్సు వినియోగింపఁబడును.
9. అంచితము:—
| శిరస్స్యాదంచితం కించిత్పార్శ్వయోర్నతకంధరమ్, | |