నవధా కథితం శీర్షం నాట్యశాస్త్రవిచక్షణైః,
తా. సమము, ఉద్వాహితము, అధోముఖము, ఆలోళితము, ధుతము, కంపితము, పరావృత్తము, ఉత్తిప్తము, పరివాహితము నని శిరోభేదములు తొమ్మిది.
1. సమము :-
నిశ్చలం సమమాఖ్యాతమున్నత్యానతివర్జితమ్. 58
తా. క్రిందకి వంపక, మీఁదికెత్తక నిశ్చలముగ నుంపఁబడునది సమశిరస్సు.
వినియోగము:-
నృత్తరమ్భే జపాదౌ చ గర్వే ప్రణయకోపయోః,
స్తమ్భనేనిష్క్రియాత్వేచ సమశీర్ష ముదాహృతమ్. 59
తా. నృత్తారంభము, జపాదులు, గర్వము, ప్రీతి, కోపము, స్తంభించి యుండుట, క్రియారహితత్వము- వీనియం దీశిరస్సు ఉపయోగింపఁబడును.
2. ఉద్వాహితము :-
ఉద్వాహితశిరో జ్నేయ మూర్ధ్వభాగోన్నతం శిరః,
తా. మీఁదికెత్తి నిలుపఁబడునది యుద్వాహితశిరము.
ధ్వజే చన్ద్రేచ గగనే పర్వతే వ్యోమగామిషు.
తజ్గవస్తుని సంయోజ్య ముద్వాహితశిరో బుధైః, 60
తా. ధ్వజము, చంద్రుఁడు, ఆకాశము, పర్వతము, ఆకాశమున సంచరించెడువస్తువులు, ఎత్తైనపదార్ధము--వీనిని చూచుటయందు ఈశిరస్సు వినియోగింపఁబడును.