పుట:Abhinaya darpanamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందుఁ గానఁబడుచున్నది. హారకేయూరాదుల నలంకరించుకొనుట అహార్యము. సాత్త్వికాదిభావములచే నెరవేర్పఁబడునది సాత్త్వికము. అని భావజ్ఞలచేతఁ జెప్పఁబడుచున్నది.

ఆజ్గికాభినయత్రైవిధ్యమ్‌.

తత్రా౽౽జ్గికో౽జ్గప్రత్యజ్గోపాజ్గభేదా త్రైధా మతః, 48

తా. ఆంగికాభినయము, అంగాభినయము, ప్రత్యంగాభినయము, ఉపాంగాభినయము నని మూఁడు విధములుగలది.

అంగాని.

అంగాన్యత్ర శిరోహస్తౌ కక్షౌ పార్శ్వకటీతటౌ. 49
పాదావితి షడుక్తాని గ్రీవామప్యపరే జగుః,

తా. తల, చేతులు, చంకలు, పార్శ్వములు, నడుము, పాదములు ఈ యారును అంగములనఁబడును. కొందరు కంఠమును సయితము అంగమని చెప్పెదరు.

ప్రత్యంగాని.

ప్రత్యంగానిత్వథస్కంధౌ బాహుపృష్ఠం తథోదరమ్. 50
ఊరూ జజ్ఘే షడిత్యాహు రపరే మణిబన్ధకౌ,
జానునీ కూర్పరమితి త్రయమప్యధికం జగుః. 51

తా. మూఁపులు, భుజములు, వీపు, కడుపు, తొడలు, పిక్కలు ఈ యారును ప్రత్యంగములు. కొందరు మణికట్టు, మోఁకాళ్ళు, మోఁచేతులును గూడ ప్రత్యంగములని చెప్పెదరు.

ఉపాంగాని.

దృష్టిభ్రూపుటతారాశ్చ కపోలౌ నాసికా హనుః,
అధరో దశనా జిహ్వా చుబుకం వదనం శిరః. 52