పుట:Abhinaya darpanamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కీర్తికాములును, భావము తెలిసికొనువారును, గుణదోషములను పరిశీలించుటయందు సమర్ధులును, శృంగారలీలాసక్తులును, పక్షపాతము లేనివారును, నీతివిశారదులును, మంచిమనస్సుగలవారును, మంచిపండితులును, భేద చతురులును, కవులును అగుమంత్రులు ఏప్రభువుదగ్గర గలరో యాప్రభువు వృద్ధి పొందఁగలవాఁడు.

రణ్గ లక్షణమ్‌.

ఏవం విధస్సభానాథః ప్రాజ్ముఖో నివనేన్ముదా,
వనేయుః పార్శ్వతస్తవ్య కవిమన్త్రిసుహృజ్జనా!. 23

తా. ఇట్టి సభానాయకుఁడు సంతోషముతో తూర్పుముఖముగాఁ గూర్చుండఁగా వాని కిరువైపుల, కవి మంత్రి సుహృజ్జనము లుండవలయును.

తదగ్రే నటనం కార్యం తత్థ్సలం రజ్గముచ్యతే.

తా. ఆరాజున కెదుట నటనము చేయవలయును. అస్థలము రంగమనఁబడును.

రంగమధ్యే స్థితే పాత్రే తత్సమీపే నటోత్తమః,
దక్షిణే తాళధారీ చ పార్శ్వద్వన్ద్వే మృదజ్గికౌ. 24

తమోర్మధ్యే గీతకార శ్శ్రుతికార స్తదన్తరే,
ఏవం తిష్ఠేత్కృమేణైవ నాట్యాదౌ రంగమణ్టపే. 25

తా. రంగమంటపమునడుమ పాత్రముండఁగా దాని వెంబడి నటోత్తముఁడును, కుడివైపు తాళగాఁడును, ఇరుప్రక్కలను మద్దెలగాంండ్రును, వారి నడుమ పాత్రము ననుసరించి గాయకులును, వారికి వెనుక శ్రుతిపోయువాడుఁను, ఇట్లు వరుసగా నుండవలయును.

పాత్ర లక్షణమ్‌.

తన్వీ రూపవతీ శ్యామా పీనోన్నతపయోధరా,