పుట:Abhinaya darpanamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శించునదియు, శాస్త్రములనెడి పుష్పములచేత నిండుకొన్నదియును, విద్వాంసులనెడి తుమ్మెదలతోఁ గూడినదియునై వెలుఁగుచున్నది.

సత్యాచారసభా గుణోజ్జ్వలసభా సద్ధర్మకీర్తిస్సభా
వేదాలజ్కృతరాజపూజితసభా వేదాన్తవేద్యా సభా,
వీణావాణివిశేషలక్షితసభా విఖ్యాతవీరా సభా
రాజద్రాజకుమారశోభితసభా రాజత్ప్రకాన్తిస్సభా. 19

తా. సత్యముతప్పక నడపువారుగలదియును, సద్గుణములచే మెరయు నదియును, మంచిధర్మమును కీర్తియును గలిగినదియు, వేదముచదివిన రాజులచేత పూజింపఁబడునదియు, వేదాంతము నెఱిఁగినదియు, వీణాగానము, వాచికగానము మొదలగువానితోఁ గూడినదియు, ప్రసిద్ధ వీరులు గలదియు, తేజస్సుచేత వెలుఁగుచున్న రాజకుమారులచేత ప్రకాశించు నదియు నభ అనఁబడును. అనఁగా సభయనునది యిన్నిలక్షణములును గలదయి యుండవలయుననుట.

విద్వాంసః కవయో భట్టాః గాయకాః పరిహాసకాః,
ఇతిహాసపురాణజ్ఞా స్సభాసప్తాజ్గలక్షణమ్‌. 20

తా. వింద్వాసులు, కవులు, పెద్దలు, గాయకులు, పరిహాసకులు, ఇతిహాసములను తెలిసినవారు, పురాణములను తెలిసినవారు అని యిట్లు సభకేడంగములు.

సభా నాయక లక్షణమ్‌.

శ్రీమాన్ ధీమాన్ వివేకీ వితరననిపుణో
          గానవిద్యాప్రవీణః,
సర్వజ్ఞః కీర్తిశాలీ సరసగుణయుతో
          హావభావేష్యభిజ్ఞః,
మాత్సర్యాద్యైర్విహీనః ప్రకృతిహితసదా
          చారశీలో దయాళు,