తా. అలపద్మహస్తములను పుంఖితములుగఁ బట్టినయెడ చక్రవాకపక్షియందు వినియోగించును.
20. కోయష్టికహస్తలక్షణమ్
| అరాళో దక్షిణే వామే పతాకేన విమిశ్రితః, | 710 |
తా. కుడిచేతి అరాళహస్తమును ఎడమచేతి పతాకహస్తముతో జేర్చి పట్టినయెడ అరాళపతాకహస్త మగును. ఇది కోయష్టికమనెడి పక్షియందు వినియోగించును.
21. వ్యాళీహస్తలక్షణమ్
| తర్జనీమధ్యమేచాగ్రేచాపవద్వక్రితేయుతే, | 711 |
| కనిష్ఠవక్రితాచా౽యం వ్యాళీవ్యాళ్యాం నియుజ్యతే, | |
తా. తర్జనీమధ్యమలను జేర్చి ధనుస్సువలె వంచి అనామికను అంగుష్ఠసంధియం దుంచి కనిష్ఠను వంచిపట్టిన నది వ్యాళీహస్త మనఁబడును. ఇది వ్యాళి యనెడిపక్షియందు వినియోగించును.
అథ జలజన్తుహస్తానిరూప్యంతే.
1. భేకహస్తలక్షణమ్
| చక్రాఙ్గుష్ఠౌచ తర్జన్యౌ హస్తయోరంతరఙ్గతౌ. | 712 |
| మధ్యమేమిశ్రితేదీర్ఘేకుఞ్చితేచా౽ప్యనామికే, | 713 |
| ఏతస్య వినియోగస్తు భేకార్థే సమ్ప్రయుజ్యతే, | |
తా. చక్రహస్తములయొక్క అంగుష్ఠతర్జనులను చేతిలోపలికి మడిచి మధ్యమలను జేర్చి అనామికలను వంచి కనిష్ఠులను చాఁచిపట్టిన నది శ్లిష్టచక్రహస్త మనఁబడును. ఈహస్తము భేకార్థమందు చెల్లును.