| లీనాలపద్మహస్తో౽యం క్రౌఞ్చార్థే సమయుజ్యతే. | 706 |
తా. ముందు చెప్పిన అలపద్మహస్తమందు చిటికెనవ్రేలు అరచేతిలో వంచఁబడినయెడ లీనాలపద్మహస్త మగును. ఇది క్రౌంచపక్షి (గ్రుడ్డికొంగ)యందు వినియోగించును.
15. ఖద్యోతహస్తలక్షణమ్
| అంగుష్టో మధ్యమాయాస్స్యాదగ్రపర్వనిపీడితః, | 707 |
తా. బొటనవ్రేలిచే నడిమివ్రేలికొనగనుపు ఒరయునట్లు అపవిద్ధముగఁ బట్టినయెడ ముఖహంసహస్త మవును. ఇది మిడుగురుపురుగునందు వినియోగించును.
16. భ్రమరహస్తలక్షణమ్
| ప్రయోజ్యో భ్రమరోహస్తో భృంగార్థే యది పుంఖితః, | |
తా. భ్రమరహస్తమును పుంఖితముగఁ బట్టినయెడ తుమ్మెదయందు వినియోగించును.
17. మయూరహస్తలక్షణమ్
| మయూరార్థే ప్రయోజ్యస్స్యాన్మయూరోపుంఖతోయది. | 708 |
తా. మయూరహస్తమును పుంఖితాకారముగఁ బట్టినయెడ నెమలియందు వినియోగించును.
18. హంసహస్తలక్షణమ్
| హంసాస్యో౽పి ప్రయోజ్యస్స్యాత్ హంసార్థే నృత్తకోవిదైః, | |
తా. మునుపుచెప్పిన హంసాస్యహస్తము హంసపక్షియందు వినియోగించును.
19. చక్రవాకహస్తలక్షణమ్
| అలపద్మౌ పుఙ్ఖితౌ చేచ్చక్రవాకే నియుజ్యతే. | 709 |