| తిర్యక్ప్రసారితః ఖడ్గముకుళో గిరికార్థకే, | |
తా. మునుపుచెప్పిన ముకుళహస్తమందు చూపుడువ్రేలిని వంచి అడ్డముగ చాఁచిపట్టినయెడ ఖడ్గముకుళహస్త మాను. ఇది చిట్టెలుకయందు చెల్లును.
15. శశహస్తలక్షణమ్
| హస్తస్తలపతాకాఖ్యశ్శశకేతిర్యగాశ్రయః. | 687 |
తా. తలపతాకహస్తము ఆడ్డముగ త్రిప్పఁబడినయెడ కుందేటియందు చెల్లును.
16. వృశ్చికహస్తలక్షణమ్
| అధోముఖో రేచితశ్చేత్కర్కటో వృశ్చికేభవేత్, | |
తా. కర్కటహస్తమును అధోముఖముగ చలింపఁజేయుచు పట్టినయెడ తేలునందు చెల్లును.
17. శునకహస్తలక్షణమ్
| పతాకాభిధహస్తేతు కుఞ్చితాచేత్కనిష్ఠికా. | 688 |
| నామ్నామధ్యపతాకో౽యం శునకార్థే ప్రయుజ్యతే, | |
తా. పతాకహస్తమందు చిటికెనవ్రేలు ముడువఁబడెనేని మధ్యపతాకహస్త మాను. ఇది కుక్కయందు చెల్లును.
18. ఉష్ట్రహస్తలక్షణమ్
| పూర్వోదితాంజలికరేచా౽౦గుష్ఠౌ కుఞ్చితాయుతౌ. | 689 |
| ప్రసారితావూర్ధ్వభాగే చలితౌ చాప్యధోముఖౌ, | 690 |
తా. మునుపుచెప్పిన అంజలిహస్తమందు అంగుష్ఠములను వంచి చేర్చి పొడుగుగఁ జాఁచి అధోముఖముగ చలింపఁజేయుచు పట్టినయెడ ఖండాంజలిహస్త మగును. ఇది ఒంటెయందు చెల్లును.