తా. మునుపుచెప్పిన మృగశీర్షహస్తమందు చూపుడువ్రేలు పైకెత్తబడినయెడ చంద్రమృగహస్త మగును. ఇది శల్యమృగమందు వినియోగించును.
10. కురంగహస్తలక్షణమ్
| కురఙ్గేచ ప్రయోక్తవ్యో మృగశీర్షకనామకః. | 683 |
తా. మృగశీర్షహస్తము జింకయందు చెల్లును.
11. కృష్ణసారహస్తలక్షణమ్
| పూర్వోక్తముష్టిహస్తేతు కనిష్ఠాంగుష్ఠసారణాత్, | 684 |
తా. మునుపు చెప్పిన ముష్టిహస్తమందు కనిష్ఠాంగుష్ఠములను చాచిపట్టినయెడ ముష్టిమృగహస్త మౌను. ఇది నల్లజింకయందు చెల్లును.
12. గోకర్ణహస్తలక్షణమ్
| ధేనుకర్ణే నాగబంధౌ రేచితౌ యది యోజితౌ, | |
తా. నాగబంధహస్తములను మీఁదికి చలింపఁజేయుచు పట్టినయెడ గోకర్ణమృగమునందు చెల్లును.
13. మూషికహస్తలక్షణమ్
| పూర్వోక్తముకుళేహస్తే తర్జనీ సమ్ప్రసారితా. | 685 |
| నామ్నా౽యంఖణ్డముకుళో మూషికార్థే నియుజ్యతే, | |
తా. మునుపు చెప్పిన ముకుళహస్తమందు చూపుడువ్రేలిని బాగుగ చాఁచిపట్టినయెడల ఖండముకుళహస్త మగును. ఈహస్తము ఎలుకయందు చెల్లును.
14. గిరికాహస్తలక్షణమ్
| పూర్వోక్తముకుళే భూయస్తర్జనీ కుఞ్చితా యది. | 686 |