పట్టఁబడిన పతాకహస్తమును దానిపై నుంచినయెడ పద్మకోశపతాకహస్త మౌను. ఇది ఎలుగుగొడ్డునందు వినియోగించును.
6. మార్జారహస్తలక్షణమ్
| పూర్వోక్తముష్టిహస్తస్యా౽నామికాఙ్గుష్ఠయోగతః, | 679 |
తా. ముందు చెప్పఁబడిన ముష్టిహస్తముయొక్క అనామికాంగుష్ఠములను జేర్చిపట్టినది అర్ధముకుళహస్త మవును. ఈహస్తము పిల్లియందు చెల్లును.
7. చమరీమృగహస్తలక్షణమ్
| వామే ముష్టి ర్దక్షిణే వా మణిబంధేన మిశ్రితా, | 580 |
| ముష్టిముద్రాకరశ్చాపి చమర్యాం సమ్ప్రయుజ్యతే, | |
తా. ఎడమచేత ముష్టిహస్తమును కుడిచేత ముద్రాహస్తమును మనికట్టుతోఁ జేర్చి క్రిందుమొగముగాఁ బట్టినయెడ ముష్టిముద్రాహస్త మౌను. ఇది చమరీమృగమునందు వినియోగించును.
8. గోధాహస్తలక్షణమ్
| ఊర్ధ్వే కనిష్ఠికాఙ్గుష్ఠౌ పతాకే కిఞ్చిదీరితౌ. | 681 |
్
| నామ్నాతలపతాకో౽యం గోధాయాం పుఞ్జితోభవేత్, | |
తా. పతాకహస్తమందు కనిష్ఠికాంగుష్ఠములను కొంచెము మీఁదికి ఎత్తిపట్టినయెడ తలపతాకహస్త మగును. ఈహస్తము ఉడుమునందు చెల్లును.
9. శల్యమృగహస్తలక్షణమ్
| పూర్వోక్తమృగశీర్షస్య తర్జన్యూర్ధ్వప్రసారితా. | 682 |
| నామ్నాచంద్రమృగోహస్త శ్శల్యార్థే సమ్ప్రయుజ్యతే, | |