Jump to content

పుట:Abhinaya darpanamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇన్ద్ర ఉవాచ:-

⁠

త్వదీయ కృపయా పూర్వం నాట్యశాలామలఙ్కృతామ్‌,
త్వదీయ నర్తక స్సోయం త్వత్కృపామభివాఞ్ఛతి.

⁠ 4

తా. ఇంద్రుడు:- ఓయి నందికేశ్వరుఁడా! తొల్లి నీ కృపారసముచే నలంకరింపఁబడిన నర్తనశాల కధిపతియైన ఈ నీనర్తకుఁడు నీదయను గోరి వచ్చియున్నాఁడు.

నన్దికేశ్వర ఉవాచ:-

⁠

మయా విధేయం కిం తస్య వద వాసవ తత్త్వతః,

⁠

తా. నందికేశ్వరుఁడు:- ఓ యింద్రుఁడా! నీకు నాచేతఁ జేయఁదగినదేమి చెప్పుము.

ఇన్ద్ర ఉవాచ:-

⁠

దైతేయ నాట్యశాలాయాం నర్తకో నటశేఖరః.

⁠ 5


⁠

తం విజేతుమయం నాట్యవినోదైః క్రమవేదిభిః,
భవద్విరచితం గ్రంథం భరతార్ణవ మిచ్ఛతి.

⁠ 6

తా. ఇంద్రుడు:- అసురనాట్యశాలయందు నటశేఖరుఁ డనెడు నటుఁడు గలఁడు. నాట్యక్రమములను దేటపరచు వినోదములచే వానిని జయించటకు మీచే రచింపఁబడిన భరతార్ణవ మనెడు గ్రంథము నపేక్షించుచున్నాను.

నన్దికేశ్వర ఉవాచ:-

⁠

చతుస్సహస్రసంఖ్యాకైర్గ్రంథైశ్చ పరిపూరితమ్‌,
భరతార్ణవశాస్త్రస్తు సుమతే శృణు సాదరమ్‌.

⁠ 7