2. వ్యాఘ్రహస్తలక్షణమ్
| అర్ధచంద్రో౽ధోముఖశ్చే ద్వాఘ్రార్థే సమ్ప్రయుజ్యతే. | 674 |
తా. అర్ధచంద్రహస్తమును ఆధోముఖముగఁ బట్టినయెడ పెద్దపులియందు చెల్లును.
3. సూకరహస్తలక్షణమ్
| పూర్వోక్తమత్స్యహస్తేతు దక్షిణః కుఞ్చితశ్చలః, | 675 |
| యుజ్యతే స్తబ్ధరోమార్థే సఙ్కీర్ణమకరః కరః, | |
తా. ముందు చెప్పిన మత్స్యహస్తమందు దక్షిణహస్తమును వంచి కదలించుచు వ్రేళ్ల నైదింటిని విరళముగఁ బట్టిన నది సంకీర్ణమకరహస్త మనఁబడును. ఈహస్తము పందియందు వినియోగించును.
4. కపిహస్తలక్షణమ్
| పూర్వోక్తముష్టిహస్తస్తు మధ్యమాంగుష్ఠయోగతః. | 676 |
| నామ్నా౽ధోముష్టిముకుళః కపేరర్థే నిరూప్యతే, | |
తా. ముందు చెప్పిన ముష్టిహస్తము మధ్యమాంగుష్ఠముల చేరికవలన అధోముష్టిముకుళహస్త మనఁబడును. ఈహస్తము కోఁతియందు వినియోగించును.
5. భల్లూకహస్తలక్షణమ్
| వామహస్తే పద్మకోశో౽ధోముఖత్వ ముపాశ్రితః. | 677 |
| దక్షిణేతు పతాకాఖ్యస్తస్యపృష్ఠతలశ్రితః, | 678 |
తా. ఎడమచేత దిగుమొగముగా పద్మకోశహస్తమును బట్టి కుడిచేత