పారిజాతవృక్షహస్తః
.
| వామే పతాకకోహ స్త స్తత్రసవ్యేపతాకికః. | 670 |
| ఉద్వేష్టితకృతోహస్తః త్రిజ్ఞానః పరికీర్తితః, | 671 |
తా. ఎడమచేతను కుడిచేతను పతాకహస్తమును పైకి త్రిప్పి పట్టినయెడ త్రిజ్ఞానహస్తమాను. ఈహస్తము రొమ్మున కెదురుగఁ బట్టినయెడ పారిజాతవృక్షమందు చెల్లును.
తింత్రిణీజమ్బూవృక్షహస్తౌ
| తింత్రిణ్యామపిలాఙ్గూలో జమ్బ్వామర్ధపతాకకః, | |
తా. చింతచెట్టునందు లాంగూలహస్తమును, నేరేడుచెట్టునందు అర్ధపతాకహస్తమును చెల్లును.
పాలాశరసాలవృక్షహస్తౌ
| పాలాశేచా౽ర్ధచన్ద్రశ్చ రసాలే త్రిపతాకికః. | 672 |
తా. మోదుగుచెట్టునందు అర్ధచంద్రహస్తమును, తియ్యమామిడిచెట్టునందు త్రిపతాకహస్తమును చెల్లును.
అథ సింహాదిమృగానాం హస్తానిరూప్యన్తే.
1. సింహహస్తలక్షణమ్
| దక్షిణే సింహవక్త్రస్స్యా త్తత్పృష్ఠే వామహస్తతః, | 673 |
| శ్లిష్టసింహముఖస్సోయం సింహార్థే వినియుజ్యతే, | |
తా. కుడిచేత సింహముఖహస్తమును బట్టి దాని వెనుకతట్టు పతాకహస్తమును ఎడమైన వ్రేళ్లు గలుగఁబట్టినది శ్లిష్టసింహముఖహస్త మనఁబడును. ఈహస్తము సింహమునందు చెల్లును.