| పాతాళశ్చైవ సప్తైతే హ్యధోలోకాః ప్రకీర్తితాః, | 657 |
తా. అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము ఈయేడు క్రిందిలోకములు. వీనియందు అపవేష్టితపతాకహస్తము వినియోగించును.
అథ వృక్షభేదానాం హస్తానిరూప్యంతే.
అశ్వత్థవృక్షహస్తః
| అలపద్మౌ రేచితౌ చే దశ్వత్థే సమ్ప్రయుజ్యతే, | |
తా. రెండు అలపద్మహస్తములను చలింపఁజేసినయెడ అశ్వత్థవృక్షమందు చెల్లును.
కదళీవృక్షహస్తః
| కదళ్యాం శ్లిష్టముకుళో రేచితో ద్వేష్టితోభవేత్. | 658 |
తా. శ్లిష్టముకుళహస్తమును పొడువుగ కదలించి పట్టినయెడ కదళీవృక్షమందు చెల్లును.
నారఙ్గలికుచవృక్షహస్తౌ
| నారఙ్గే పద్మకోశస్స్యా ద్భ్రమరోలికుచే భవేత్, | |
తా. నారింజచెట్టునందు పద్మకోశహస్తమును, గజనిమ్మచెట్టునందు భ్రమరహస్తమును చెల్లును.
పనసబిల్వవృక్షహస్తౌ
| పనసే చతురః ప్రోక్తో బిల్వార్థే చతురోభవేత్. | 659 |
తా. పనసబిల్వవృక్షములయందు చతురహస్తము చెల్లును.