పుట:Abhinaya darpanamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్టబడినయెడ శత్రుఘ్నునియందును చెల్లును. ఇట్లు ఈహస్తములు క్రమముగా సూర్యవంశపురాజుల విషయమందు చెప్పఁబడెను. ఈహస్తములే యెడమప్రక్కగా పట్టఁబడునెడ చంద్రవంశపురాజుల విషయమునందు వినియోగించునని నాట్యశాస్త్రజ్ఞులచేత జెప్పఁబడుచున్నది.

సప్తసముద్రహస్తా నిరూప్యంతే.

లవణేక్షుసురాసర్పిర్దధిక్షీరజలార్ణవాః.

639


ఏ తేషాం హస్తకలనా విశేషాత్ప్రతిపాద్యతే,

తా. లవణము, ఇక్షువు, సుర, సర్పి, దధి, క్షీరము, జలము అని సముద్రములు ఏడు. వీనియందు హస్తసందర్భములు విశేషముగాఁ జెప్పఁబడును.

1. లవణసముద్రహస్తలక్షణమ్

ముకుళాఖ్యౌకరౌచైవ వృతౌతా చా౽పవేష్టితౌ.

640


ప్రయోజ్యౌ లవణామ్బోధౌ ధిషణస్య మతాంతరే,

తా. విరివిగా త్రిప్పబడిన ముకుళహస్తములను అధోముఖములుగఁ బట్టినయెడల లవణసముద్రమందు చెల్లును అని బృహస్పతి మతము.

2. ఇక్షుసముద్రహస్తలక్షణమ్

అలపద్మస్తథాభూత ఇక్ష్వబ్ధౌ సమ్ప్రయుజ్యతే.

641

తా. అలపద్మహస్తమును క్రింద చెప్పినప్రకారమే పట్టినయెడ ఇక్షుసముద్రమందు చెల్లును.

3. సురాసముద్రహస్తలక్షణమ్

సఙ్కీర్ణాఖ్య పతాకౌచ తథైవ గుణమాశ్రితౌ,
సురామ్బుధౌ ప్రయోక్తవ్యౌ శుక్రాచార్య మతాంతరే.

642