పుట:Abhinaya darpanamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

నన్దికేశ్వరప్రోక్తం

అభినయదర్పణమ్‌

ఇష్టదేవతాప్రార్థనా

శ్లో.

ఆఙ్గికం భువనం యస్య వాచికం సర్వవాఙ్మయమ్‌,
ఆహార్యం చన్ద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్‌.

1

తా. ఎవనికి భువనము ఆంగికాభినయమో, వాగ్రూపములైనవియెల్ల నెవనికి వాచికాభినయమో, చంద్రతారాదులు ఎవనికి ఆహార్యాభినయమో, అటువంటి సత్త్వప్రధానుఁడగు శివునికి నమస్కరించెదను.

ఇన్ద్ర ఉవాచ:—

కళ్యాణాచలవాసాయ కరుణారససింధవే,
నమో౽స్తు నందికేశాయ నాట్యశాస్త్రార్థదాయినే.

2

తా. ఇంద్రుఁడు:— కైలాసపర్వతనిలయుఁడును, దయాసముద్ర్రుడును, నాట్యశాస్త్రార్ధప్రభుఁడునైన నందికేశ్వరునికి నమస్కరించెదను.

నన్దికేశ్వర ఉవాచ:—

స్వాగతం తే సురాధీశ కుశలం త్రిదివౌకసామ్‌,
కిమర్థమాగతం బ్రూహి భవతా మమ సన్నిధౌ.

3

తా. నందికేశ్వరుఁడు:— ఓ యింద్రుఁడా! నీకు స్వాగతము. స్వర్గవాసులందరికిని క్షేమమా? నీరాకకు కారణమేమి?