పుట:Abhinaya darpanamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మాంధాతాగ్రిమభూపాలే మరుత్వానితిభూభుజి.

632


నిరూపణార్థే ముకుళ సూచీముష్టికరో౽పిచ,
కరో౽ప్వర్ధపతాకస్స్యాదుద్వేష్టిత తనుమ్భజన్.

633


ఏతే చతుర్విధా హస్తాః ప్రయోజ్యంతే యథాక్రమాత్,
రఘూవజ మహీపాలే దక్షిణేతరభాగతః.

634


క్రమేణ పరియోజ్యేతే పూర్వోక్తార్ధపతాకకౌ,
అలపద్మస్స్వస్తికశ్పేద్యోజ్యో దశరథే నృపే.

635


రామే శిఖరహస్తో౽సౌ విశేషాచ్పాపపాణిషు,
యోజ్యః శాస్త్రప్రయోగేషు పూర్వధర్మవిశారదైః.

636


శిఖరో౽యం దక్షిణాంసగామీచే ద్భరతే భవేత్,
అయంవా మాంసగామిచే ల్లక్షణార్థే నియుజ్యతే.

637


అయం లలాటగావిూచే చ్ఛత్రుఘ్నార్థే నియుజ్యతే,
సోమవంశేజనిజుషామేతే వామాంసయోజనాత్.

638


కల్పితా నాట్యకుశలైః యుక్తధర్త ప్రయోగతః,

తా. మాంధాతయనెడి రాజశ్రేష్టునియందును, మరుత్తు అనెడి మహారాజునందును, ముకుళహస్తము సూచీహస్తము ముష్టిహస్తము ఉద్వేష్టితార్ధపతాకహస్తము ఈనాలుగుహస్తములును క్రమముగ చెల్లును. రఘుమహారాజు, ఆజమహారాజు వీరియందు అర్ధపతాకహస్తములు కుడియెడమలుగా చెల్లును. దశరథమహరాజునందు, స్వస్తికాలపద్మహస్తము చెల్లును. శిఖరహస్తము రామునియందును, చాపపాణులైన రాజులయందును చెల్లును. శిఖరహస్తము కుడిమూపునందుఁ జేర్చిపట్టఁబడినయెడ భరతునియందును, ఎడమమూపునందుఁ జేర్చిపట్టినయెడ లక్ష్మణునియందును, నొసటికి సరిగా