పుట:Abhinaya darpanamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములుగాఁ బట్టినయెడ వర్ధమానహస్త మవును. దీనికి అధిదేవత వాసుకి. ఇది నృసింహస్వామి. అతని తేజస్సు, హిరణ్యకశిపుని రొమ్మును చీల్చుట వీనియందు చెల్లును.

19. ఉద్వృత్తహస్తలక్షణమ్

అధరోత్తరయో రేక సమయే హంసపక్షయోః,
ఉద్వృత్త ఇతివిఖ్యాతో వాసిష్ఠో౽స్యా౽ధిదేవతా.

503

తా. ఒకేసమయమందు క్రిందుమీఁదులుగ హంసపక్షహస్తములు పట్టఁబడినయెడ ఉద్వృత్తహస్త మవును. దీనికి అధిదేవత వాసిష్ఠమహర్షి.

వినియోగము:—

లజ్జాయాముపమార్థేచ సంతాపే కంటకాదిషు,
భేదే భయే విచారేచ ఉద్వృత్తకరఈరితః.

504

తా. సిగ్గు, సాదృశ్యము, సంతాపము, ముల్లు మొదలయినది, భేదము, భయము, చింత వీనియందు ఈహస్తము వినియోగించును.

17. విప్రకీర్ణహస్తలక్షణమ్

స్వస్తికః శీఘ్రవిశ్లేషాత్ విప్రకీర్ణస్స ఉచ్యతే,
దక్షిణామూర్తిరేతస్య అధిదేవః ప్రకీర్తితః.

505


చేలాఞ్చలస్యవిస్రంసే సయుజ్యేత విధూననే,

తా. ముందు చెప్పినస్వస్తిహస్తమును వడిగా వదలినచో విప్రకీర్ణహస్త మవును. దీనికి అధిదేవత దక్షిణామూర్తి. ఇది కొంగు తొలఁగించుటయందును, వదలించుటయందును చెల్లును.