| క్షత్త్రజాతౌ రక్తకాంతా పూర్ణనాభో నియుజ్యతే, | |
తా. తలగోకుకొనుట, దొంగతనము, నరసింహుఁడు, మృగముఖము, సింహము, కోఁతి, తాబేలు, కొండగోగు, స్తనము, భయము, క్షత్త్రియజాతి, ఎఱ్ఱవన్నె వీనియందు ఈహస్తము చెల్లును.
గ్రంథాంతరే బాణహస్తలక్షణమ్
| తర్జన్యాద్యాస్త్రయశ్శ్లిష్టాః కిఞ్చిదఙ్గుష్ఠపీడితాః. | 422 |
| కనిష్ఠికాచ ప్రసృతా సబాణః కథితః కరః, | 423 |
తా. చూపుడువ్రేలుమొదలు మూఁడువ్రేళ్ళను బొటనవ్రేలితో చేర్చి చిటికెనవ్రేలిని చాఁచిపట్టినయెడ బాణహస్త మవును. ఇది ఆఱు అని లెక్కపెట్టుటయందును నాళనృత్యమునందును వినియోగించును.
గ్రంథాంతరే అర్ధసూచికహస్తలక్షణమ్
| కపిత్థ తర్జన్యాశ్చోర్ధ్వ సారణాదర్ధసూచికః, | 424 |
తా. కపిత్థహస్తపుచూపుడువ్రేలు పొడువుగా ఎత్తిపట్టఁబడినయెడ అర్ధసూచికహస్త మగును. ఇది మొలక, పక్షి పిల్ల మొదలగునది, పెద్దపురుగు వీనియందు వినియోగించును.
అథ చతుర్వింశతిసంయుతహస్తానిరూప్యంతే.
| అంజలిశ్చ కపోతశ్చ కర్కటస్స్వస్తిక స్తథా, | 425 |