పుట:Abhinaya darpanamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినియోగము:—

బిల్వపత్రే త్రిత్వయుక్తే త్రిశూలః కరఈరితః.

417

తా. మారేడుపత్రి, మూఁటికూడిక వీనియందు ఈహస్తము వినియోగించును.

ఇత్యష్టావింశతిః ప్రోక్తా అసంయుతకరాః క్రమాత్,
యావదర్థాః ప్రయోగాణాం తావద్భేదాః కరాః స్మృతాః.

418

తా. ఈ చెప్పఁబడిన యిరువదియెనిమిదిహస్తములును అసంయుతహస్తము లనఁబడును. ఈహస్తముల ప్రయోగార్థములు ఎన్ని కలవో అన్నిహస్థభేదములును గలవని చెప్పుదురు.

గ్రంథాంతరే ఊర్ణనాభహస్తలక్షణమ్

పద్మకోశాఙ్గుళీనాంచ కుఞ్చనాదూర్ణనాభకః,
హస్తాభ్యాం కుర్వతః పూర్వం దైత్యవక్షో విదారణమ్.

419


నృసింహాదూర్ణనాభశ్చ జాతశ్శార్దూలకోఋషిః,
క్షత్త్రాన్వయోరక్తకాంతి రాదికూర్మో౽ధిదేవతా.

420

తా. పద్మకోశహస్తము వ్రేళ్ళను వంచిపట్టినయెడ ఊర్ణనాభహస్త మవును. ఇది పూర్వము నృసింహస్వామి హిరణ్యకశిపునిరొమ్మును నఖములచేత చీల్చునపుడు నృసింహస్వామివలనఁ బుట్టెను. ఇది క్షత్త్రియజాతి. దీనికి శార్దూలకుఁడు ఋషి. రక్తవర్ణము. ఆదికూర్మము అధిదేవత.

వినియోగము:—

శిరః కండూయనే చౌర్యే నరసింహే మృగాననే,
హర్యక్షే వానరే కూర్మే కర్ణికారే కుచే భయే.

421