| తేషాం మూర్తిత్రయీభావః ఋగ్యజుస్సామభిఃపురా. | 413 |
| యేన హస్తేనా౽భినీతో విధేరగ్రే యతస్తతః, | 414 |
| శఙ్ఖవర్ణో దేవజాతిరధిదేవో బృహస్పతిః, | |
తా. ఇది పూర్వము ఆకృతులను ధరించిన మూఁడువేదములు బ్రహ్మయెదుట నిలిచి తమ యభిప్రాయమును తెలుపునపుడు వానివలనఁ బుట్టెను. ఇది దేవజాతి. దీనికి దేవేంద్రుఁడు ఋషి. శంఖవర్ణము. బృహస్పతి అధిదేవత.
వినియోగము:—
| లోకత్రయే త్రిశూలేచ త్రిసఙ్ఖ్యా గణనే౽పిచ. | 415 |
| అశ్రుసమ్మార్జనే వేదత్రయే బిల్వదళే౽పిచ | 416 |
తా. మూఁడులోకములు, శూలాయుధము, మూఁడని లెక్కపెట్టుట, కన్నీరు తుడుచుట, మూఁడువేదములు, మారేడుపత్రి, దేవజాతి, తెల్లవన్నె వీనియందు ఈహస్తము వినియోగించును.
28. త్రిశూలహస్తలక్షణమ్
నికుఞ్చయిత్వా౽ఙ్గుష్ఠంతు | |
తా. బొటనవ్రేలిని చిటికెనవ్రేలిని వంచి తక్కినవ్రేళ్లను చాఁచిపట్టినది త్రిశూలహస్త మనఁబడును.