పుట:Abhinaya darpanamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాంతరస్థహంసపక్షహస్తలక్షణమ్

కనిష్ఠా సర్పశీర్షేసా సారితా హంసపక్షకః.

391


తాండవాభ్యసనేహంసపక్షాకారః కరః స్మృతః,
తండోర్జాతో హంసపక్షః భరతో ఋషిరుచ్యతే.

392


నీలవర్లో౽ప్పరోజాతి రధీశః పఞ్చసాయకః,

తా. సర్పశీర్షహస్తమునందలి చిటికెనవ్రేలిని చాఁచిపట్టినయెడ హంసపక్షహస్త మగును. శివునిసన్నిధియందు తండువు తాండవము నభ్యసించునపుడు హంసరెక్కవలె చేతిని పట్టెను గనుక ఆతండువువలన హంసపక్షహస్తము పుట్టెను. ఇది అప్సరోజాతి. దీనికి ఋషి భరతుఁడు. వర్ణము నీలము. మన్మథుఁడు అధిదేవత.

వినియోగము:—

శుభనాట్యే సేతుబంధే వీణావాదే సమాహృతౌ.

393


నియంత్రణే పక్షిపక్షే పర్యాప్తౌ రూపలేఖనే,
శ్యామవర్ణే౽ప్సరోజాతౌ హంసపక్షో నియుజ్యతే.

394

తా. శుభనాట్యము, నీళ్ళకు అడ్డకట్ట కట్టుట, వీణ వాయించుట, సంగ్రహించుట, కట్టుట, పక్షిరెక్క, ముగియుట, చిత్తరువు వ్రాయుట, నలుపువన్నె, అప్సరోజాతి వీనియందు ఈహస్తము వినియోగించును.

25. సందంశహస్తలక్షణమ్

పునఃపునః పద్మకోశే
సంశ్లిష్టా ప్రసృతా యది,
సందంశాభిధహస్తో౽యం
కీర్తితో భరతాగమే.

395