తా. బొట్టుకట్టుట, ఉపదేశము, నిశ్చయము, గగుర్పాటు, ముత్యము మొదలైనవి, చిత్రము వ్రాయుట, అడవియీగ, నీటిబొట్టు, దీపపువత్తి నెగఁద్రోయుట, ఒరయుట, శోధించుట, మల్లెమొగ్గలు మొదలైనవి, గీఁత గీయుట, పూలదండ పట్టుకొనుట, నేనే బ్రహ్మ మనుట, రూపించుట, లేదనుట, ఒరసి చూడఁదగినవస్తువులను భావించుట, కృతకృత్యము వీనియందు ఈహస్తము వినియోగించును.
గ్రంథాంతరస్థహంసాస్యహస్తలక్షణమ్
| శ్లిష్టాగ్రమధ్యమాఙ్గుష్ఠ తర్జన్యో యత్రసారితౌ, | 334 |
| న్యగ్రోధమూలమాశ్రిత్య మునీనాం తత్త్వదర్శనే, | 385 |
| శుభ్రవర్ణి విప్రజాతిరధీశ శ్చతురాననః, | |
తా. బొటనవ్రేలిని చూపుడు నడిమివ్రేళ్ళను చేర్చి, ఉంగరపువ్రేలిని చిటికెనవ్రేలిని చాఁచిపట్టినయెడ హంసాస్యహస్త మవును. ఇది మఱ్ఱిమానిక్రింద మునులకు జ్ఞానోపదేశము చేయునప్పుడు దక్షిణామూర్తివలనఁ బుట్టెను. ఇది విప్రజాతి. దీనికి శుకుఁడు ఋషి, వర్ణము తెలుపు. బ్రహ్మ అధిదేవత.
వినియోగము:—
| జ్ఞానోపదేశే పూజాయాం నిర్ణయేచతిలాహుతౌ. | 386 |
| భాషణేషఠనే గానే ధ్యానేభావనిరూపణే, | 387 |
| వేణునాదే సంయుతశ్చేద్వాసనాయాం నిజాత్మని, | |