తా. నడిమివ్రేలిచేత బొటనవ్రేలిని తాఁకి చూపుడువ్రేలిని వంచి తక్కినవ్రేళ్లను చాఁచిపట్టినయెడ భ్రమరహస్త మగును.
వినియోగము:—
| భ్రమరేచశుకేయోగే సారసే కోకిలాదిషు, | 374 |
తా. తుమ్మెద, చిలుక, యోగాభ్యాసము, బెగ్గురుపక్షి, కోయిల మొదలైనపక్షులు వీనియందు ఈహస్తము వినియోగించును.
గ్రంథాంతరస్థభ్రమరహస్తలక్షణమ్
| హంసాస్యతర్జనీనమ్రాయదిస్యాద్భ్రమరఃకరః, | 375 |
| కశ్యపాద్భ్రమరోజాతః కపిలో ఋషిరుచ్యతే, | 376 |
తా. హంసాస్యహస్తమునందలి చూపుడువ్రేలు వంచిపట్టునెడ భ్రమరహస్త మగును. ఇది పూర్వమందు కశ్యపబ్రహ్మ అదితిదేవికి కమ్మలు చేయునపుడు ఆయనవలనఁ బుట్టినది. ఇది గంధర్వజాతి. దీనికి ఋషి కపిలుఁడు. చామనచాయ. పక్షిరాజు అధిదేవత.
వినియోగము:—
| యోగే మౌనవ్రతే శృంగేగజదస్తనిరూపణే, | 377 |
| కర్ణమంత్రస్యరచనే కంకోటద్ధరణే౽పిచ, | 378 |
| ఖేచరేమేచకేవర్ణే భ్రమరో౽యం నియుజ్యతే, | |