పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
84
అబలాసచ్చరిత్ర రత్నమాల.

మియ్యనట్టి సదానందమయమైన పరలోకమునకుఁ జనెను. ఆహా! యిట్టిస్త్రీ రత్న మింత యల్పకాలమునందే నష్టమగుట మనదేశముయొక్క దౌర్భాగ్యమనియే చెప్పవలయును. ఆమె మరణమువలన జననీజనకులకు నమితదు:ఖము కలుగుట యొక ఆశ్చర్యముగాదు. ఎట్టియనామధేయులు చనిపోయినను వారి మాతాపితలకు దు:ఖము కలుగుటస్వభావమే కాని రక్తసంబంధములేని పరుల కనేకులకు నెవరిమరణమువలన దు:ఖము విశేషముగాఁగలుగునో వారే మనుష్యునామమున కర్హులు.

పాఠశాలయందు నామెకొరకు దు:ఖించని పిల్లగాని, ఉపాధ్యాయినిగాని కానరాదయ్యెను. ఆమె సద్గుణములు దలఁచుకొని దు:ఖించుచు ననేకు లనేక లేఖలను ఆమె తలిదండ్రులకు వ్రాసిరి. వాని నన్నిఁటి నిటవ్రాయుటవలనఁ గ్రంథవిస్తార మగునని వానిలో నొకయుత్తర మిందు నుదాహరించెదను. ఇది యామె యుపాధ్యాయినులలో నొకతయగు నొకయాంగ్లేయ స్త్రీచే వ్రాయఁబడినది.

'మాప్రియ శిష్యురాలగు ఆవడాభాయి దేవలోకమున కరిగెను గాని యామెకు విద్య నేర్పునట్టి యోగ్యాధికారము వడసిన వారి హృదయమున కామె యెప్పటికిని మఱుపురాదు.

ఆమె ప్రారంభించినవాని నన్నిఁటిని మిగుల శ్రద్ధతోఁ దుదముట్టించుచుండెను. ఎన్నఁడు మధ్యవిడుచునదికాదు'

'నాయదృష్టవశమున రెండుసంవత్సరము లామెకు గణితము నేర్పుభాగ్యమునాకుఁ గలిగెను. ఈవిషయ మామె మిగుల శ్రద్ధతో నేర్చుకొనుచుండెను. ఈరెండు సంవత్సరము