పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
83
ఆవడాబాయి

నాకు బహుమానముగా దొరికినసొమ్మునే నాయనకుఁ బంపుచుంటిని. ఈసంవత్సర మీరుగ్ణతవలన బహుమతి పొందలేదు . కాన పాప మాబీదవాని కేమియుఁ బంపనైతిని. కనుక తా మాతని కేదేనిఁ బంపిన నాకు బరమసంతోషము కలుగును" తత్క్షణమే భిడేగారు 20 రూపాయలను ఆవడాబాయిపేరుఁబెట్టి గోవిందరావు చింధడే గారికి హుండీ పంపిరి. తదనంతరము భిడేగారు తనముద్దుల కూఁతురిపేరు జనులకు జ్ఞాపక ముండునట్లుగా నామె చదువుకొను పాఠశాలలో నొకబహుమతి యుంచగోరి తనయభిప్రాయము ఆవడాబాయికిఁ జెప్పి నీ కేవిషయము విశేషప్రీతికరమా చెప్పుమని యడిగెను. అందుకామె "నాయనా! నాయనంతరము జనులు నన్నుఁ దలఁచుకొను నంతటి ఘనకార్య మేదియు నేను జేయలేదు. తమరు చేయు బహుమానమున కెంత మాత్రమును నేనర్హు రాలనుకాను" అనెను. అందుకామెతండ్రి మఱింత వేగిరిపఱుపఁగా తనకు గణితమునందును డ్రాయింగునందును విశేషప్రీతికలదని యామె చెప్పెను. అందుపైభిడేగా రపుడే వెయ్యిరూపాయలు పాఠశాలాధ్యక్షునికడకుఁ బంపి, అందుపై వచ్చెడి వడ్డి ప్రతిసంవత్సరము గణితములో, డ్రాయింగులో నందఱికంటె నధికముగా పరీక్షయిచ్చిన కన్యకుఁబహుమాన మిచ్చునట్లు నియమించెను. ఈ సంభాషణ జరిగిన పిదప నిరువది నాలుగుగంటల కనఁగా 1889 వ సంవత్సరము జనవరి 22 తేది మంగళవారము మధ్యాహ్నము రెండుగంటల వేళ ఆవడాబాయి తనదేహ మీనశ్వర భూలోకమున విడిచి, తనకీర్తినిచట శాశ్వతముగానుండ నియమించి, దుష్టుల దుర్భాషణల కెంతమాత్రమును నవకాశ