పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

అబలాసచ్చరిత్ర రత్నమాల.

పర్వతప్రాంతమున కరిగెను. కాని యచటినుండివచ్చిన తదనంతర మేమియు సుగుణమగుపడక రుగ్ణత హెచ్చసాగెను. ఇట్లు రుగ్ణత హెచ్చినందువలన అక్టోబరునెలనుండి యామె విద్యాభ్యాసము బొత్తుగా మానవలసినదాయెను. ఇంగ్లీషు డాక్టర్లు హిందూవైద్యులు పరీక్షించి యెన్నిమందు లిచ్చినను రోగము నిమ్మళించక హెచ్చుచుండెను. కడుపులో శూలవిశేషముగాఁ బుట్టుచున్నందున నామెతాళఁజాలక మరణమునకుఁ బూర్వము కొన్నిరోజు లప్పుడప్పుడు కేకలు వేయుచుండెను. అందుకామె తండ్రి "బిడ్డా! నీకంటి కేమయినఁ దోఁచుచున్నదా? నీకు మరణభీతి కలుగుచున్నదా?" యని యడిగెను. అందు కామె "నాకు మరణమన్న నెంతమాత్రము భయములేదు. నేను పాపము చేయనపుడు పరలోకయాత్రకు భయమేలపడుదును? ప్రాణముతో సమానముగా నున్న పెంచినట్టి మిమ్ము నెడబాయవలసినందుకు, నేను జన్మించినందుకు జనోపయోగకరమయిన కార్యమేదియుఁ జేయకయే దేహము విసర్జించ వలసివచ్చెఁగదాయనియు కొంచెము వ్యసనముగా నున్నది. కాని యీశ్వరాజ్ఞ శిరసావహించి సంతోషముతో వెడలుటయే మనకర్తవ్యము. నాకడుపులో దు:ఖసహమగువేదనకుఁ దాళఁజాలక నేనిట్లు అఱచెదనెగాని మరణభీతిచేతఁగాదు" అనెను. అందుపైభిడే "ఆవడా! నీమనసునం దెవ్వరికైన నేమేని యియ్యఁదలఁచితివేని ఆసంగతి నాకుఁ జెప్పుము" అని యడుగఁగా ఆవడాబాయి యిట్లనెను. "నేనీసంవత్సరము నన్నూ చిన్నతనమునందుఁ బెంచిన గోవిందరావు చింధడేగారికి నేమియుఁ బంపలేదు. ప్రతిసంవత్సరము పాఠశాలయందు