పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవడాబాయి

77

డ్రాయింగు, ఈరెంటియం దధికప్రవీణురా లనియు, మాడెల్ డ్రాయింగు విషయమునం దీమెకు మిగుల చాతుర్యము గలదనియు, పరీక్షకులు వ్రాసిరి. 1887 వ సంవత్సరము స్కాలరషీపుపరీక్షకు నింగ్లీషుపరీక్షకులుగా వామన ప్రభాకరభావే యను విద్వాంసుని దొరతనమువారు నియమించిరి. ఆసంవత్సరము ఆవడాబాయి యింగ్లీషు అయిదవపాఠపుస్తకము చదువుచుండెను. అప్పు డాయన వేసినప్రశ్నకు ఆవడాబాయి వ్రాసియిచ్చినయుత్తర మింగ్లీషునం దెంతయు రసవంతముగా నున్నదని ఆంగ్లేయ భాషాపారంగతులు మెచ్చుకొనెదరు. అంత యుత్తమభాషయు, నుదాత్త విచారణములును గలవ్యాస మిప్పుడు ప్రవేశపరీక్షలోఁ దేరినవారుగూడ వ్రాయఁగలరా యని సంశయింపవలసి యున్నదఁట (ఆవ్యాసముయొక్క తాత్పర్య మిచ్చట నాంధ్రమున వ్రాయుచున్నాను.

పరీక్షకులగు బావేగారడిగిన ప్రశ్న : _ నీ పాఠశాలయం దార్జించినవిద్యను గృహకృత్యములయం దెట్టుపయోగపఱచెదవు?

ఆవడబాయి వ్రాసి యిచ్చిన యుత్తరము : _ నాకిచట నేర్పఁబడువిద్య ముందు నాకు నధికోపయోగకరమగునని తల చెదను. నాసంసారపాశములఁ ద్రెంపుట పరమేశ్వరున కధిక సమ్మత మయినందున నాజన్మమిఁక పరోపకారమునందే గడపఁ దలంచితిని. ఇట్టి నాతలంపున కిపుడే నభ్యసించు విద్య మిగుల సహాయకారి యగును. ఇంటిలెక్కలు వ్రాయుటకుఁ దల్లికిఁ దోడుపడుదును. ఇంగ్లీషుగ్రంథములను జదివి వానియర్థ మామెకుఁ దెలిపెదను. మహారాష్ట్రస్త్రీలకొఱ కనేకాంగ్లేయ