పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
76
అబలాసచ్చరిత్ర రత్నమాల.

ఆవడాబాయి ప్రతిసంవత్సరము పరీక్షలయందుఁ దేరుచు తప్పక బహుమానములను బొందుచు వచ్చెను. తాను చదివినపుస్తకము లన్నియు తనకాపీపుస్తకము లన్నియు, తనవారపరీక్షలలోని ప్రశ్నోత్తరకాగితము లన్నియు నామె తనమరణకాలము వఱకును మిక్కిలి శ్రద్ధతో దాఁచియుంచెను. శ్రద్ధయను సద్గుణము బాల్యమునుండియే యామెయందుఁ గానుపించుచుండెను. (1884 వ సంవత్సరమునుండి 1888 వ సంవత్సరమువఱకు నాలుగుసంవత్సరములలో నీమె ఇంగ్లీషు నాఱవపారపుస్తకము ముగించెను. సాధారణముగా నొక్కొక్కపుస్తకము చదువుటకు నొక్కక్క సంవత్సరము పట్టును; గాని ఆవడాబాయి రెండవ మూడవపాఠపుస్తకముల నొక్కసంవత్సరములోనే చదివెను. ఈమె యింగ్లీషు నాల్గవపాఠపుస్తకముతోడనే సంస్కృతాధ్యయనము ప్రారంభించెను.) ఈమె సంస్కృతమునం దధిక శ్రద్ధగలిగి పని చేసినందున త్వరలోనే యాదేశభాషయందు నామెకుఁ గొంత వ్యుత్పత్తిజ్ఞానము గలిగి రఘువంశము, శాకుంతలము, వేణీసంహారము మొదలయిన సంస్కృతగ్రంథము లామె చదివెను. పాఠశాలయం దాంగ్లేయ సంస్కృతభాషల నభ్యసింపఁగా మిగిలినకాలమునం దీమె డ్రాయింగు (చిత్తరువు, పటములువ్రాయుట) సహితము నేర్చుకొనుచుండెను. (1887 వ సంవత్సరమునం దీమె డ్రాయింగుయొక్క ఫస్టుగ్రేడుపరీక్షయందు కృతార్థురాలయి ఫ్రీహ్యాండు, మాడెల్, డ్రాయింగులయం దధికప్రవీణురాలని బహుమానపత్రికలను బడయుటయేగాక కర్తవ్య రేఖాగణితము నందు గొప్ప బహుమతి వడసెను. రేఖాగణితము, ఫ్రీహ్యాండ్