పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అంకితము

ఎవరి పరిపూర్ణ కృపాకటాక్షంబుచే నాకీగ్రంథంబు వ్రాయునంత శక్తియు స్వాతంత్ర్యంబును గలిగెనో, నాశరీరమునందలి చర్మంబుచే బాదరక్షల నిర్మించి జన్మజన్మంబునందును బాదంబులకు దొడిగినను నెవరిఋణంబుదీరి నేను ఋణవిముక్త నగుట యసంభవంభో, యెవరు నాకు దేవాది దేవునికంటె నధిక తముండయిన దేవుండో యట్టి నాప్రియభర్త యగు మ.రా.రా. భండారు మాధవరావుగారి దివ్యపాదపద్మములకు నీ గ్రంథంబు సమర్పించి యంకితం బొనర్చుచున్నదానను

భండారు-అచ్చమాంబ.
________