పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
68
అబలాసచ్చరిత్ర రత్నమాల.

మునందు చితూరుదరబారునం దున్న వారప్పటి యుద్ధమును చక్కఁగా వర్ణించియున్నారు.

అక్బరుబాదుషా తనయమితసైన్యముతో చితూరుపై దండు వెడలినప్పు డచటనుదయసింగుఁ డనురాజు రాజ్యముఁ జేయుచుండెను. ఉదయసింగు రాణా యంతటి పిఱికిరాజపుత్రుఁడు మఱియొకఁ డుండఁడు. అక్బరుబాదుషా దండెత్తివచ్చినవార్త విని రాణాగారికి భయమువలన దేహ కంప మెత్తెను. కాన ఆయన విజయు లగుతురుష్కు సేనలతోడఁ బోర సాహసింప లేఁడయ్యె. అందుపై నాతని శూరులగు సరదార్లందఱు కుంభరాణా మొదలగు నాతని పూర్వుల ప్రతాపమునుఁ దెలిపి యుద్ధమునకుఁ బురికొల్పసాగిరి. కాని యతఁడు యుద్ధమునకు వెడలఁ డయ్యెను. రాణా సంగ్రామమునకు వెఱచుటఁ గని యాతని సరదార్లు మిగుల నాగ్రహించి "మీరు శత్రువుల నెదిరించి యుద్ధము చేయకుండినయెడల మిమ్మును రాజ్యభ్రష్టులను జేయుదుము" అనిరి.

ఇట్లందఱు నేకతీరుగాఁ జెప్పినందువలన విధిలేక భయముచే దేహము వడఁక నాయధైర్యశిరోమణి వీరులగు తనసైనికులతో యుద్ధభూమిని సమీపించెను. కానిసాగరమువలె నలుగడల నిండియున్న యవనసైన్యములంగని భీతిచేఁ గొంతవడి నేమియుఁ దోఁచక నిలుచుండెను. తదనంతర మెటులనో యారాజు తనసైన్యములకు యుద్ధమున కనుజ్ఞయిచ్చెను. రజపూత శూరసైనికు లందఱు మిగుల శౌర్యముతోడఁ బెనఁగఁ జొచ్చిరి. వారు జయకాంక్షవలన నెంతపోరినను ముఖ్య నాయకుని యధైర్యమువలనను, పరబలాధిక్యమువలనను వారికి జయము క