పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తఱిగొండ వెంగమాంబ.

63

నది యయినను గొందఱు యువతుల కిది సహగమనమునకన్నను విశేషభయంకరమయినదని తోఁచుచున్నది. వారిట్లువిరూపులై నలుగురిలో నవమానకరమగు నిట్టిబ్రతుకు బ్రతుకుటకంటెను సహగమనముచేసి యొకగడియ దు:ఖముతో దేహము విడుచుట నూఱురెట్లెక్కువ సులభమని తలఁచుచున్నారు. వారు సహగమనము లేక పోవుటకు విశేషచింత నొంది దాని మాన్పినవారినే క్రూరులని నిందింపుచున్నారు. సాధారణముగ పురుషుల కయినను దుస్సహమగు నవమానము కలిగి బ్రతుకుటకంటెనుమరణమే సుఖదాయకముగ నుండునని తోఁచుట సహజము. ముందుఁ దమకవమానము కలుగునని తెలిసి యాత్మహత్య చేసికొనిన పురుషు లెందఱో కలరు. ఇందువలన సహితము నవమానముకంటె మరణమే మేలని జనులకుఁ దోఁచునని మనకు దెలియుచున్నది. కాననస్మద్దేశబాంధవు లందఱును మనదేశములోని స్త్రీలకుఁ గలుగుచున్న యీవ్యసనకరమగు నవమానమును దొలఁగింప బ్రయత్నింతురు గాత.

ఈమె మిక్కిలి వృద్ధురాలయి కాలధర్మము నొందెను. 1840 వ సంవత్సరము వఱ కీమె జీవించియున్నట్టు తెలియుచున్నది. బాలవితంతు వై నందున నీమెభర్త నామగోత్రము లెచటనుఁ గానరావు. వెంగమాంబచే రచియింపఁబడిన గ్రంథములలో రాజయోగసార మనువేదాంతపరమయిన ద్విపద కావ్యమును, వెంకటాచల మాహాత్యమును మాత్రము ముద్రింపఁబడి యున్నవి. వీనిలో రాజయోగసారము భాగవతము నందలి తృతీయ స్కంధాంతర్గతమైన కపిలదేవహూతి సంవాదమునుగొని మిగులరసవంతముగాను, సులభముగాను,