పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తఱిగొండ వెంగమాంబ.

61

వలికి రాఁగానే యామె ముఖమునం దానందమును, దేహమునందు సుగంధమును గానవచ్చు చుండెనఁట. ఇందువలననామె వదినలామెయందు దోషముకలదని తలఁచి దానిని గనిపెట్టుట కయి యాగదిద్వారముకడ కాచియుండిరఁట. అంతఁ గొంతసేపటికి లోపల నెవ్వరో పురుషుఁడు నవ్వినట్టును, నృత్యము చేసినట్టును వారికి వినఁబడెనఁట. అందుపై వారు తమభర్తలను బిలిచి తాము విన్నసంగతులను దెలిపిరఁట. అట్లందఱు గుమిగూడి వెంకమ్మను తలుపు తెఱవుమనఁగానామె నిర్భయముగాఁ దలుపు తీసెనఁట. అప్పుడు వారాయఱనంతను శోధించి పురుషుని నెవ్వనిని గానక యామె నడుగఁగా శ్రీకృష్ణుఁడుదప్ప నన్యపురుషుఁడేల వచ్చునని పలికెనఁట. ఇవి యన్నియునామె భక్తివిశేషమును దెలుపుకధలేగాని వేరుగాదు.

వెంగమాంబ తనజీవితకాలమునం దంతను శిరోజముల నుంచుకొనినందున జనులామె యన్న దమ్ములను బహిష్కరించెదమని బెదరించిరి. వారంతటితో నూరకుండక శంకరస్వాములవారు రాఁగా నాలోకగురున కీమెసంగతి విన్నవించిరి. అందుపై నాస్వాములవారు వెంకమ్మను బిలిచి నీశిరోజములు తీయించుకొమ్మని చెప్పెను. అందు కామె యించుకయు జంకక పరమేశ్వరుఁ డిచ్చినవి మనుజులేల తీయవలెననియు, అందువలన పరపురుషస్పర్శదోషము కలుగుననియు, ఒకపర్యాయము తీసిననవి మరల రానియెడలనది పరమేశ్వరునకు సమ్మతమనియు, అట్లుగాక మఱుదినముననే మరల వెండ్రుకలు మొలచుటచే నది పరమేశ్వరునకు నసమ్మతమని స్పష్టముగాఁ దెలియుచున్న దనియు, వాదించెను. అంతటితో నూరకుండక గురు