పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
55
పన్నా.

ఎంతచెప్పినను పన్నావినదని తెలిసికొని తా నాలస్యముచేసిన రాజపుత్రుని ప్రాణము దక్కదని యెఱిఁగినవాడగుటచే వాఁడాతట్టను నెత్తిని నిడికొని రాజనగరు వెలుపలి కరిగె. పన్నాదాదియు రాజపుత్రుని అలంకారములను తనపుత్రునకు నలంకరించి వానిని రాజబాలుని పానుపు, పైనిదురబుచ్చెను. ఇటు లారాజభక్తి గల యువతి తనపుత్రుఁడు నిదురింపుచుండ తా నాపక్కసమీపమునందుండిబనబీరునిరాక నిరీక్షింపుచుండెను. ఇంతలో నాకాలస్వరూపుఁ డచటికివచ్చి మిగుల దయగల వానివలె రాజపుత్రుని దేహము స్వస్థముగా నున్నదాయని పన్నానడిగి వానిని జూచెద నని పక్క యొద్దికరిగెను. ఆప్రకార మచటి కరిగి వాఁడు నిదురింపచున్నవా రెవ్వరని విచారింపక నాయర్భకుని పొట్టలో కత్తిపొడిచి పాఱిపోయెను. ! వాఁ డటుపొడువఁగా నాబాలుఁ డొక కేక వేసిప్రాణములు విడిచెను. అ కేక రాజభవనమునం దంతటను వినఁబడి జనులనందఱిని లేపెను.

అ కేక విన్నతోడనే రాజభవనమునందలి వారందఱచటికి వచ్చిరి. వారువచ్చిచూచునప్పటికి రాజపుత్రుని దేహమంతయు రక్తమయమయి యాబాలుఁడు ప్రాణములనువిడిచియుండెను ; పన్నాదాది యాబాలుని సమీపముననే దేహము తెలియక పడియుండెను. చచ్చినవాఁడు రాజపుత్రుఁడేయని తోఁచుటచే జనులందఱు మిగులదు:ఖించిరి. పన్నా సేదదేరిన పిదప రాజపుత్రుని జంపినవా రెవ్వరని యడుగఁగా "నొకనల్లటి పురుషుఁ డెవఁడో చంపెన"ని చెప్పెను. రాజపుత్రుని జంపినవా రెవ్వరో యని యనేకులు లూహించిరి. కానిసాక్షులు