పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పన్నా.

                క. ఇప్పుడు నయ్యుత్తమసతి నప్పురమున
                    నొప్పువార లతిముద మొదవం
                    జొప్పడఁ గీర్తనసేయుదు రిప్పరసున
                    నుండవలదె యింతులు పుడమిన్.
                                                        [చింతామణి.

మేవాఁడదేశపు రాజగు సంగ్రామసింహుఁడు మృతుఁడయినవెనుక నాతని పుత్రులు ముగ్గురిలో నిరువురు స్వల్పకాలమే రాజ్యము పాలించి పరలోకమున కేగిరి. మూడవవాఁడగు ఉదయసింహుఁ డైదేండ్లప్రాయము కలవాఁడయి దాది పోషణలోనే యుండెను. ఈతని దాదిపేరు పన్నా. ఈపన్నాకురాజధాత్రిత్వము వంశపరంపరగా వచ్చుచుండెను. ఈమె సుగుణములు మిగుల విలువగలవని తెలుపునటులఁ గాఁబోలును నవరత్నములలోని దగు[1] (పన్నా పచ్చ) యని తలిదండ్రు లామెకుఁ బేరిడిరి. పన్నా వారిడిన నామమునకుఁ దగు గుణవతి యయ్యెను.

సంగ్రామసింహుని పుత్రు లిరువురును స్వర్గస్థులైన పిదప నుదయసింహుపేర పృథివీరాజునకు దాసీపుత్రుఁడగు బన

  1. ఈమెపేరు ఒకానొక తెలుఁగుగ్రంధకారుఁడు మోతి (ముత్యము) యని వ్రాసినాఁడుగానియందు కాధారమేమియుఁరాజపుత్రా నాచరిత్రమునందుఁ గానగాలేదు.